
కౌలు రైతుకు కష్టం..!
కూటమి పాలనలో భరోసా కరువు ఏ సాయం అందక అవస్థలు జిల్లాలో 13,635 మంది కౌలు రైతులు వీరికి అందని అన్నదాత సుఖీభవ పంట రుణాలు అంతంత మాత్రమే.. కౌలు రైతులకు రుణ లక్ష్యం రూ.140 కోట్లు ఇచ్చింది రూ.మూడు కోట్లే...
చర్యలు తీసుకుంటాం..
జిల్లాలో కౌలు రైతుల కష్టాలు చెప్పనలవి కానివిగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. అన్నదాత సుఖీభవ ఇవ్వని కూటమి ప్రభుత్వం... రుణాల మంజూరులో విఫలమైంది. ఇటు ఎటువంటి పెట్టుబడి సాయం అందక... అటు రుణాలు కూడా అందకపోవడంతో కౌలు రైతు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ సాగును కొనసాగిస్తున్నాడు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని విధాల సాయం అందడంతో సంతోషంగా సాగు చేసిన కౌలు రైతులు కూటమి పాలనలో అన్నింటికీ దూరమై కష్టాల నడుమ సాగు కొనసాగిస్తున్నారు.
విజయనగరం ఫోర్ట్:
కౌలు రైతుల సంక్షేమానికి పాటు పడతామని ఎన్నికల వేళ గొప్పలు చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక వారి కష్టాన్ని పట్టించుకోవ డం లేదు. కనీసం ఎటువంటి సాయం అందజేయ డం లేదు. కూటమి పాలకులు చెబుతున్న మాటల కు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలో కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణకు భూమిని కౌలుకు తీసుకుని రైతులు భూమిని సాగు చేస్తున్నా రు. ప్రకృతి సహకరిస్తే పరవాలేదు. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేయాలంటే వారికి పెట్టుబడి కావాలి. ఇందుకోసం వారు ప్రైవేటు వ్యాపారుల దగ్గర వడ్డీకి డబ్బులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం అందించే సాయంతో పాటు రుణ సాయం కూడా అందని దుస్థితి. దీంతో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా సాధారణ రైతులు మాదిరి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేసింది. దీంతో వారు పంటల సాగుకు పెట్టుబడి కోసం అప్పలు చేసే పరి స్థితి తప్పింది. రైతు భరోసా కింద వారికి రూ. 13,500 చొప్పన ఇవ్వడం వల్ల వారు వాటిని విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు పెట్టుబడి సాయంగా ఉపయోగించుకునేవారు. అదేవిధంగా కౌలు రైతులకు రుణాలు కూడా ఇచ్చింది. కూటమి ప్రభుత్వంలో కౌలు రైతుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
మొదట విడతలో కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అందలేదు. ఇంతవరకు రూ.3 కోట్ల పంట రుణాలు ఇచ్చారు. మిగతా వారికి కూడా రుణాలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం.
– వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి