
మడ్డువలసకు 3200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులోకి 3200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నీరు వచ్చి చేరుతోంది. సువర్ణ ముఖి, వేగావతి నదుల నుంచి నీరు వచ్చి చేరడంతో 64.45 మీటర్లు లెవెల్ నీటిమట్టం ప్రాజెక్టు వద్ద నమోదైంది. దీంతో ఒక గేటు ఎత్తి 2080 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ ఆదివారం తెలిపారు.
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తమ వివరాలతోపాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని సూచించారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్‌గా పూరించాలన్నారు. జిల్లా ప్రజలు పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
కాల్ సెంటర్ 1100 సేవలను
వినియోగించుకోవాలి
అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.