
కోడూరుమాత యాత్రోత్సవం నేడు
బాడంగి: మండలంలోని కోడూరు మరియమాత యాత్రోత్సవం శనివారం జరగనుంది. ఈ యాత్రలో సుమారు 20వేలమంది క్రైస్తవ, ఇతర మతస్తులైన యాత్రికులు పాల్గొనున్నారు. ఈ యాత్రకు సాలూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం డిపోలనుంచి ఆర్టీసీవారు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.ఉదయం నుంచే దివ్యబలిపూజలు నిర్వహించనున్నారు.మూడవపూజకు విశాఖ అగ్రపీఠాధిపతులు హాజరుకానున్నారు.భక్తులు మాతను దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటయ్యాయి. బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి, రూరల్ సీఐ నారాయణ రావుతోపాటు ఎస్సై సిబ్బంది శుక్రవారం యాత్ర స్థలాన్ని సందర్శించి యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందో బస్తు ఏర్పాట్లు చేయనున్నారు. ఆర్టీసీబస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు వన్‌వే ట్రాఫిక్‌ను పాటిస్తూ బాడంగిలోని పిన్నవలస జంక్షన్ వద్ద ప్రవేశించి కోడూరునుంచి రామచంద్రపురం మీదుగా బయటకు వెళ్లనున్నాయి. కాలినడకన పలువురు భక్తులు రానున్నారు.
మహిళ మెడలో గొలుసు అపహరణ
వేపాడ: మండలంలోని నీలకంఠరాజపురం సమీపంలో రైవాడ కాలువ గట్టుపై గుర్తుతెలియని వ్యక్తి ఓ మహిళ మెడలో గొలుసును తెంపుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నీలకంఠరాజపురం గ్రామానికి చెందిన నెక్కల లక్ష్మి తన తల్లితో పశువులకు గడ్డి కోసుకుని వస్తుండగా గ్రామసమీపంలోని రైవాడ కాలువగట్టుపై ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చి వెంకటలక్ష్మి మెడలో గొలుసు తెంపుకుని పారిపోయాడు. దీంతో వెంకటలక్ష్మి వల్లంపూడి పోలీసులకు పిర్యాదు చేయడంతో ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను అరా తీశారు. గుర్తుతెలియని వ్యక్తి ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు పోలీసు బృందాలతో విచారణ చేయిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కోడూరుమాత యాత్రోత్సవం నేడు