
అనాథ బాలికలకు 100 సైకిళ్ల పంపిణీ
బాడంగి: విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తల్లితండ్రులు లేని అనాథబాలికలకు సుమారు రూ.4లక్షల విలువైన 100సైకిళ్లను పంపిణీ చేశారు. బాడంగి హైస్కూల్‌లో హెచ్‌ఎం సత్యనారాయణ అధ్యక్షతన బొబ్బిలి డిప్యూటీ డీఈఓ మోహన్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై శుక్రవారం సైకిళ్లను పంపిణీ చేశారు. బెంగళూరుకు చెందిన వసుధైక కుటుంబం, కేజీబ్రీసంస్థ, కెనరాబ్యాంకువారి సౌజన్యంతో సైకిల్స్ సమకూర్చగా కనీసం పాఠశాలలకు రెండుకిలోమీటర్ల దూరం, 85శాతం మార్కులు సాధించిన అనాథబాలికలకు అందజేశారు. అదేవిధంగా హైస్కూల్‌లో చదువుతున్న 50 మంది అనాథబాలికలకు ఒక్కొక్కరికి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున రూ.50వేలు అందజేశారు. కార్యక్రమంలో వీకేపౌండేషన్ ప్రతినిధి ప్రతాప్, కెనరాబ్యాంకు డీజీఎం అనంతపద్మనాభం, రీజనల్‌మేనేజర్ వినోద్, సీనియర్ మేనేజర్ రాజ్యలక్ష్మి, ఎంఈఓ. లక్ష్మణదొర, జెడ్పీటీసీ పెద్దింటిరామారావు, ఎంపీటీసీ డి.శ్రీనివాస రావు, సర్పంచ్ కండి రమేష్, ఎస్‌ఎంసీ చైర్మన్ భారతి, మూడు జిల్లాలనుంచి హాజరైన బాలికలు, తల్లిడండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయుడు కొల్లి ఈశ్వరరావు నిర్వహించారు.