
మందుగుండు నిల్వలు సీజ్
కొమరాడ: మండలంలోని శివిని గ్రామ సమీపంలో దీపావళి మందుగుండు సామగ్రి అక్రమ నిల్వలు గురువారం పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. ఎస్‌ఐ కె.నీలకంఠం తెలిపిన వివరాల ప్రకారం... ముందస్తు సమాచారం మేరకు శివిని గ్రామానికి చెందిన సేనాపతి రాజేష్ రానున్న దసరా, దీపావళి పండగలు నేపథ్యంలో అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వలు ఉంచారన్నారు. తమిళనాడు రాష్ట్రం శివకాశి నుంచి ఈ సామగ్రి తీసుకుని వచ్చి అనుమతులు లేకుండా భద్రపరిచారని తమకు వచ్చిన సమచారం మేరకు సిబ్బందితో కలసి దాడి చేసినట్టు తెలిపారు. రూ.2లక్షల విలువ గల సామగ్రి స్వాధీనం చేసుకుని పోలీస్‌ష్టేషన్‌కు తరలించి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
బుచ్చి అప్పారావు జలాశయం నీరు విడుదల
గంట్యాడ: గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయం (తాటిపూడి) నీటి మట్టం పెరుగడంతో జలాశయం నుంచి గురువారం రాత్రి నీటిని విడుదల చేశారు. జలాశయం నీటి మట్టం 297 అడుగులు కాగా ప్రస్తుతం 295.500కు చేరింది. జలాశయం నుంచి 100 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదలచేశారు.
కోడూరు మరియమాత యాత్రకు సర్వం సిద్ధం
బాడంగి: కోడూరు మరియమాత యాత్రకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 13న జరగనున్న దివ్యబలిపూజలు, ప్రార్థనలకు వీలుగా టెంట్లు, వరుస క్రమంలో వెళ్లి మాతను దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. తలనీలాలు సమర్పించుకునే భక్తుల కోసం ఆర్‌సీఎం పాఠశాల భవనం వద్ద ప్రత్యేక కాంప్లెక్స్‌ను నిర్మించారు. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
మిథున్‌రెడ్డిని కలిసిన బెల్లాన
చీపురుపల్లి: రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని విజయనగరం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ రాజమండ్రిలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నవరంలో సత్యనారాయణస్వామి వ్రత, తీర్థ ప్రసాదాలను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మిథున్‌రెడ్డిని కలిసిన బెల్లాన