
వైఎస్సార్‌సీపీ ప్రతిష్టను పెంచేలా పనిచేస్తా
● పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి
విజయనగరం: రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా స్థాపించిన వైఎస్సార్‌సీపీ ప్రతిష్టను పెంచేలా, రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతమయ్యేలా పనిచేస్తానని పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని చెప్పారు. నగరంలోని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో శ్రావణినిను పార్టీ విజయనగరం నియోజకవర్గం నాయకులు, కార్పొరేటర్లు గురువారం అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ తనకు కొత్త బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, రాజకీయ ఓనమాలు నేర్పించి, అనునిత్యం వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న తండ్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి కృజత్ఞలు తెలిపారు. చదువుకున్న మహిళలు రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళలను రాజకీయంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు అన్నిరంగాల్లో మహిళలకు తగిన ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకు గౌరవంతో పాటు గుర్తింపు లేకుండా పోతుందన్నారు. అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వాటిపై మహిళా నాయకురాలిగా పోరాటం చేసి మహిళలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, కార్పొరేటర్లు ఆశపు సుజాత, పిన్నింటి కళావతి, తాళ్లపూడి సంతోషి, బోనెల ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.