
కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: ప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా 12 మంది కలెక్టర్లను బదిలీచేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా 2015 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎస్.రామసుందర్‌రెడ్డిని నియమించింది. ప్రస్తుతం ఆయన రీహెబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ కమిషనర్‌గా, సీడీఏ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంతవరకు పనిచేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు బదిలీ అయింది. పోస్టు కేటాయించాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా జిల్లాలోని అధికార పార్టీ నాయకులతో ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో కలెక్టర్ అంబేడ్కర్ బదిలీ కోరుకున్న విషయాన్ని ఇటీవల ‘సాక్షి’లో ‘ఎల్లిపోతా..నేనెల్లిపోతా...’ అనే శీర్షికతో వచ్చిన కథనం నిజమయింది.

కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి