
ప్రశ్నించే గొంతుకపై కక్ష సాధింపు
అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఒక నాయకుడు ప్రెస్‌మీట్‌లో చెప్పిన అంశాలను ప్రచురిస్తే కేసులు పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకే విరుద్ధం. నిన్నమొన్నటి వరకూ ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రశ్నించిన సామాన్యుల నుంచి పెద్దల వరకు కక్ష సాధింపులకు పాల్పడిన కూటమి ప్రభుత్వం ఇప్పుడేమో ఏకంగా నిజాలను ప్రచురించే మీడియా/పత్రికలపై క్షక్షసాధింపులకు దిగడం హేయమైన చర్య. ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని చూస్తే రెట్టింపు ఉత్సాహంతో ప్రజావ్యతిరేక అంశాలపై ప్రశ్నిస్తూనే ఉంటాయన్న సంగతిని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛపట్ల గౌరవ భావం కలిగి ఉండాలి. భయపెట్టి నిజాలను కప్పివేయాలనుకోవడం సరికాదు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై వేసిన కేసులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి.
– పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి

ప్రశ్నించే గొంతుకపై కక్ష సాధింపు