
16 నుంచి రామతీర్థంలో పవిత్రోత్సవాలు
నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 16 నుంచి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని దేవస్థాన ఈవో వై.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పవిత్రోత్సవాలకు అంకురారోపణం చేస్తామన్నారు. 17న మంగళాశాసనం, తీర్థ గోష్ఠి, యాగశాలలో ప్రత్యేక హోమాలు జరుగుతాయన్నారు. అదే రోజు మధ్యాహ్నం అకల్మష హోమాలు, పవిత్ర శుద్ధి ఉంటుందని, 18న పారయణాలు, జపములు, హవనాలు, అష్టకలశ స్నపన మహోత్సవం జరిపించి శ్రీరామచంద్రస్వామికి అర్చకులు పవిత్ర సమర్పణ చేస్తారన్నారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు.
ప్రారంభమైన కళా ఉత్సవ్ పోటీలు
నెల్లిమర్ల: స్థానిక వేణుగోపాలపురంలో ప్రభుత్వ డైట్ కళాశాలలో కళా ఉత్సవ్–2025 జిల్లా స్థాయి పోటీలు గురువారం సందడిగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలిరోజు నృత్యం, గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం తదితర అంశాలపై వ్యక్తిగత, బృంద పోటీలు నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన ప్రిన్సిపాల్ కె.రామకృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి వున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కళాఉత్సవ్ పోటీలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. కా ర్యక్రమంలో శ్రీనివాసరావు,ఉ త్సవాల నోడల్ అధికారి వి.చిన్నంనాయుడు, అధ్యాపకులు కాళ్ల అప్పారావు, సూరిబాబు, శ్రీనివాసరావు, లక్ష్మణరావు, మురళి తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలో ఈ నెల 13, 14 తేదీల్లో జరగనున్న జన విజ్ఞాన వేదిక (జేవీవీ) 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఎన్ వెంకటరావు, నాయకులు వి.రాజ్‌గోపాల్, చీకటి దివాకర్, జి.నిర్మల పిలుపునిచ్చారు. స్థానిక జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా రాజ్యాంగం పేర్కొన్న శాసీ్త్రయ దృక్పథాన్ని ప్రజల్లో నాటేందుకు జేవీవీ కృషి చేస్తోందని చెప్పారు. మహాసభ ప్రారంభ సమావేశానికి జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జెవీవీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గేయానంద్, చెకుముకి పత్రిక పూర్వ సంపాదకులు ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య, పూర్వ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం హాజరుకానున్నారని తెలిపారు. అనంతరం మహాసభల పోస్టర్‌ను విడుదల చేశారు.

16 నుంచి రామతీర్థంలో పవిత్రోత్సవాలు

16 నుంచి రామతీర్థంలో పవిత్రోత్సవాలు