
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
● స్కూల్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీలకు
స్పందన
● ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్‌బాల్ జట్ల ఎంపిక పూర్తి
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగుతున్నాయి. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని మూడు ప్రాంతాల్లో ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, పుట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహించగా... వందలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారు. హాజరైన క్రీడాకారులకు అండర్ – 14, 17 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. నగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో జరిగిన ఫుట్‌బాల్ జట్ల ఎంపికలకు 500 మంది క్రీడాకారులు హాజరుకాగా... పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 72 మంది క్రీడాకారులు బాల, బాలికల విభాగాల్లో జిల్లా జట్లకు ఎంపికయ్యారు. విజ్జి స్టేడియంలో నిర్వహించిన ఫెన్సింగ్ పోటీలకు 120 మంది క్రీడాకారులు హాజరుకాగా.. 48 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన వారిలో ఉన్నారు. అండర్ – 17 విభాగంలో బాల, బాలికలకు నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 16 మంది క్రీడాకారులు అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో రాష్ట్ర స్థాయిలో జరగబోయే స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి పాత్రినిధ్యం వహించనున్నట్టు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, విజయలక్ష్మి తెలిపారు. ఎంపిక పోటీలను వ్యాయామ అధ్యాపకులు బంగార్రాజు, పివిఎస్‌ఎన్.రాజు, సౌదామణి, మాధవ్, ఆదిలక్ష్మి, నాయుడు, శ్రీనివాసరావు, తిరుపతిరావు, శివకుమార్, అనురాధ తదితరులు పర్యవేక్షించారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా...