
మద్యం అక్రమ అమ్మకాలపై ప్రత్యేక డ్రైవ్
కురుపాం: మద్యం అక్రమ అమ్మకాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కురుపాం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో అనధికార అమ్మకాలు (బెల్ట్ షాపులు) నిర్వహిస్తున్న వారి కోసం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిపై ఐదు రోజుల పాటు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసి వారి నుంచి 32 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలు చేసినా, గొలుసు దుకాణాల నిర్వహణకు వేలం పాట నిర్వహిస్తున్నా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎకై ్సజ్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్సై జె.రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.
నలుగురి అరెస్టు