
ఒక బస్తాను ఏం చేసుకోవాలి?
నేను నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేస్తున్నా. నెల రోజులుగా యూరియా రాలేదు. ప్రస్తుతం వరి పంట పిలకలు వేస్తున్నాయి. ఈ తరుణంలో యూరియా వేయాలి. నాలుగు బస్తాల యూరియా అవసరం కాగా ఒక్క బస్తా ఇస్తున్నారు. దీనిని ఏం చేసుకోవాలి?. ఎన్ని ఎకరాలున్నా ఒక బస్తా మాత్రమే ఇస్తామంటున్నారు. ఇది రైతులను మోసం చేసే ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతూ ఆనందంగా లేడు.
– కెల్ల నారాయణరావు, రైతు,
గుంకలాం గ్రామం, విజయనగరం మండలం