
వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషిచేద్దాం
● రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాన్‌వెస్లీ
పార్వతీపురం రూరల్: వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తెచ్చేందుకు క్రిస్టియన్ మైనార్టీలంతా కృషిచేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీసెల్ అధ్యక్షుడు జాన్ వె వెస్లీ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమానికి కృషిచేస్తూ పార్వతీపురం మన్యంజిల్లాలో మైనార్టీల అభివృద్ధి కోసం పేద, వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కా రానికి కృషిచేస్తామన్నారు. క్రైస్తువులంతా ఏకమై వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తేవడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కుల, మత, ప్రాంత, పార్టీల భేదం లేకుండా ఇళ్లకే పథకాలందించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని అఽధికారంలోకి తెచ్చుకు నేందుకు ముందస్తు ప్రణాళికలతో క్రైస్తవ సోదరులంతా ఏకం కావాలని కోరారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అనేక వర్గాల వారిని అవస్థలకు కూటమి ప్రభుత్వం గురిచేస్తోందన్నారు. అనంతరం ఆయన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జిల్లావ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ మైనార్టీ నాయకులకు తదుపరి కార్యాచరణపై వివరించారు. కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ లక్ష్మణరావు, సాలూరు, కురుపాం మైనార్టీసెల్ అధ్యక్షులు సువార్త రాజు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.