
హోంగార్డు కుటుంబానికి ‘చేయూత’
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్‌శాఖలో హోంగార్డుగా పని చేసి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎంవీ కృష్ణారావుకు ‘చేయూత‘ అందించేందుకు సిబ్బంది పోగు చేసిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు రూ.3,22,340/ల చెక్కును ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన లేదా ఉద్యోగ విరమణ చేసిన హోగార్డు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నామన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు హోంగార్డ్స్’ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు మొత్తాన్ని పోగు చేసి, వారి కుటుంబాలకు చేయూతగా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వల్ల పోలీస్ ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ ఇన్‌చార్జ్ ఆర్‌ఐ ఆర్.రమేష్ కుమార్, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు కుటుంబసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.