
కొంతమందికే ఇంటింటికీ రేషన్
● ఈ కింది ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం విజయనగరం పట్టణంలోని గోకపేటలోనిది. గోకపేట రేషన్ డిపో నుంచి బియ్యాన్ని సైకిల్ పై వేరే మహిళ సహాయంతో వృద్ధురాలు ఇంటికి తీసుకుని వెళ్తోంది.
వృద్ధుల ఇంటికి సరుకులు ఇవ్వాలి
65 ఏళ్లు దాటిన వృద్ధుల ఇంటికి వెళ్లి సంబంధిత రేషన్ డీలర్ రేషన్‌న్‌సరుకులు ఇవ్వాలి. ఎక్కడైనా ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటాం.
– మురళీనాథ్, జిల్లా పౌరసరఫరాల అధికారి
విజయనగరంఫోర్ట్:
ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు. జిల్లాలోని అనేక మంది వృద్ధులకు ఎదురువుతున్న దుస్థితి. ఇంటింటికీ వెళ్లి రేషన్ అందించే పక్రియకు కూటమి సర్కార్ స్వస్తి పలికింది. దీంతో ప్రజలకు కష్టాలు మొదలుయ్యాయి. అయితే 65 ఏళ్లు దాటిన వృద్ధుల ఇంటికే రేషన్ సరుకులు అందిస్తామని కూటమి సర్కార్ చెప్పింది. అది కూడా పూర్తిస్థాయిలో అమలు కావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమందికే రేషన్ అందిస్తున్నారనే విమర్శలు తలెత్తుతున్నాయి.
జిల్లాలో రైస్ కార్డులు 5,74,137
జిల్లాలో రైస్ కార్డులు 5,71,137 ఉన్నాయి. వారందరికీ ప్రతి నెల రేషన్ డిపోల ద్వారా సరుకులు అందించాల్సి ఉంది. వారిలో 65 ఏళ్లు దాటినవారు 69,246 మంది ఉన్నారు. వారందరికీ ఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు అందించాల్సి ఉంది. కానీ వారికి పూర్తిస్థాయిలో ఇంటికి రేషన్ సరుకులు అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గత ప్రభుత్వంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో రైస్ కార్డు దా రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు అందించారు. అన్ని వర్గాల ప్రజల ఇంటికే వెళ్లి రేషన్ అందించడం వల్ల వారికి ఇబ్బందులు తప్పాయి. గంటల తరబడి రేషన్ సరుకుల కోసం నిరీక్షించాల్సిన పని ఉండేది కాదు. దీని వల్ల పనులు మానుకుని ఉండాల్సి వచ్చేది కాదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారు, రేషన్ డిపో దూరంగా ఉన్నవారు 2,3 కిలోమీటర్లు నడిచి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అటువంటి వారికి ఇంటికి వెళ్లి సరుకులు అందించేవారు. దీనివల్ల వారికి వ్యయ ప్రయాసలు తగ్గేవి. కానీ కూటమి సర్కార్ పాలనలో రేషన్ సరుకుల కోసం వాగులు, వంకలు, దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటింటికీ వెళ్లే ఆసక్తి లేదనే ఆరోపణలు
65 ఏళ్లు నిండిన వారి ఇంటికి రేషన్ సరుకులు ఇవ్వడానికి డీలర్లు అసక్తి చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల వృద్ధులు రేషన్ డిపోలకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి వస్తోంది. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్నదే అయినప్పటికీ తప్పని పరిస్థితి.
పూర్తిస్థాయిలో వృద్ధుల ఇంటికి చేరని బియ్యం
జిల్లాలో రైస్ కార్డులు 5,73,137
వాటిలో 65 ఏళ్లు దాటిన వారు 69,246 మంది