
ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
● పార్వతీపురంలో మారథాన్
5కె రెడ్‌రన్
పార్వతీపురం టౌన్/రూరల్: జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్, మాదక ద్రవ్య దుర్వినియోగంపట్ల యువతలో అవగాహన పెంపొందించేందుకు యూత్‌ఫెస్ట్–2025 ఐఈసీ మారధాన్ 5కె రెడ్‌రన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్, ఎస్‌వీడీ డిగ్రీ కళాశాల వద్ద జెండాను ఊపి రెడ్‌రన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు నాలుగురోడ్ల కూడలి మీదుగా రన్ ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం కలెక్టర్ హెచ్‌ఐవీపై, రక్షణ లేని లైంగిక సంబంధాలు, రక్తమార్పిడి, వాడిన చిరంజీల వినియోగం వంటి తదితర వ్యాప్తి చెందే సందర్భాలపై అవగాహన కల్పించారు. అనంతరం మారధాన్ రెడ్ రన్‌లో మహిళలు, పురుషుల విభాగంలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. గెలుపొందిన వారిలో మహిళా విభాగంలో పి.అరుణ, ప్రథమ, బి.స్పందన ద్వితీయ స్థానాలను సాధించగా పురుషుల విభాగంలో బి.సాయి ప్రథమ, ఎం.అజయ్‌లు ద్వితీయ స్థానం గెలుచుకున్నారు. అలాగే ట్రాన్స్‌జెండర్ విభాగంలో బి.చిన్ని ప్రథమ, బి.ప్రశాంత్ ద్వితీయ స్థానం గెలుపొందారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.10వేలు, ద్వితీయ బహుమతిగా రూ.7వేలు కలెక్టర్ అందించారు. అలాగే క్విజ్ కాంపిటేషన్‌లో ప్రథమ స్థానం విజేతలు మౌనిక, వైష్ణవి, వాసు ద్వితీయ స్థానంలో భువనేశ్వరి, కుమారి తృతీయ స్థానంలో మామిలి, భవ్యశ్రీలకు కూడా కలెక్టర్ బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్‌కుమార్, ఏఆర్‌టీ అధికారి డా. ఫణీంద్ర, దిశ సీపీఎం కేవీఆర్. శైలజ, డీఎస్‌డీఓ డా.శ్రీధర్, దిశ టీం జి.అమ్మినాయుడు, జి.కోటేశ్వరరావు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్‌జీఓలు, ఎన్‌ఎస్‌పీ ఫెసిలిటీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.