
ఇసుక బండి కింద పడి రైతు మృతి
శృంగవరపుకోట: మండలంలోని వేములాపల్లి గ్రామంలో మంగళవారం ఇసుక బండి కింద పడి ఓ రైతు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గోస్తనీనదిలోకి ఇసుక కోసం బండి తోలి లోడు వేసుకుని వస్తున్న సమయంలో బొడబల్ల సన్యాసిరావు(48) ప్రమాదవశాత్తు జారిపోయి బండి కింద పడిపోగా టైరు సన్యాసిరావు మీదుగా వెళ్లిపోయింది. దీంతో హుటాహుటిన సహచరులు ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు మృతుడి భార్య ఉమ ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్.కోట పోలీసులు వివరించారు. మృతుడు సన్యాసిరావుకు భార్య ఉమ, పిల్లలు భువనచంద్ర, మౌనికలు ఉన్నారు.
ట్రాక్టర్ కిందపడి వృద్ధుడు..
శృంగవరపుకోట: పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వన్‌వే జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్ రోడ్డు వారగా నడిచి వెళ్తున్న కొటానవీధికి చెందిన కొటాన వల్లయ్య(74)ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ తొట్టి టైరు కింద పడిన వల్లయ్య అక్కడికక్కడే ప్రాఽణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న ఎస్.కోట పోలీసులు వెంటనే ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న కొడుకు నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఇసుక బండి కింద పడి రైతు మృతి