
భయపెట్టిన కింగ్‌కోబ్రా
సీతంపేట: సుమారు 18 అడుగుల పొడవు ఉన్న కింగ్‌కోబ్రా సీతంపేటలోని ఓ ప్రైవేటు నర్సరీ పంప్‌షెడ్ గదిలో తిష్టవేసింది. సామగ్రి తీసేందుకు సోమవారం గదిలోకి వెళ్లిన నర్సరీ యజమాని భుజంగరావు పామును చూసి భయపడ్డారు. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. శ్రీకాకుళం నుంచి స్నేక్‌క్యాచర్స్ ఖాన్, అశోక్ వచ్చి కింగ్‌కోబ్రాను పట్టుకుని కొత్తూరు–బత్తిలి రిజర్వ్ ఫారెస్టు పరిధిలో విడిచిపెట్టినట్టు ఎఫ్‌బీఓ దాలినాయుడు తెలిపారు.
రాళ్లదారిలో 4 కిలోమీటర్లు..
కొమరాడ: మండలంలోని పాలెం పంచాయతీ పరిధి కుస్తూరు గ్రామానికి చెందిన తాడింగి సురేష్ సోమవారం త్రీవ అస్వస్థతకు గురయ్యాడు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో కుటుంబ సభ్యులు డోలీలో రాళ్ల దారిలో 4 కిలోమీటర్ల దూరంలోని పూజారి గూడ గ్రామం వరకు తీసుకొచ్చి ఆటోలో కురుపాం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108లో జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధిని విస్మరించిందని, రోడ్ల సదుపాయం కల్పనకు కనీస చర్యలు తీసుకోవడంలేదని గిరిజన సంఘాల నాయకులు మండిపడ్డారు. తరచూ డోలీ కష్టాలు ఎదురవుతున్నా పట్టించుకోవడంలేదంటూ వాపోయారు.
కింగ్‌కోబ్రాను
పట్టుకున్న
స్నేక్ క్యాచర్

భయపెట్టిన కింగ్‌కోబ్రా