
సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేయాలి
రాజాం : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేయాలని ఆ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజాంలో సమగ్ర శిక్ష ఉద్యోగులతో ఆదివారం సమావేశమైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమగ్ర శిక్షలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగు లను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని కోరారు. వీరిని వెంటనే రెగ్యుల ర్ చేయాలని పట్టుబట్టారు. హెచ్‌ఆర్ పాలసీ అమ లు, ఉద్యోగ భద్రత కల్పించాలని, మినిమమ్ ఆఫ్ టైం స్కేల్ అమలు చేసి, గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను వెంటనే ప్రారంభించి, పదవీ విరమ ణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఈపీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ సెలవులు, హెల్త్‌కార్డుల వంటి హక్కులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాల ని కోరారు. కేజీబీవీ పాఠశాలల ప్రిన్సిపాళ్లపై రాజకీ య వత్తిడిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థను రాజకీయ దుర్వినియోగానికి గురికాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉందని స్పష్టం చేశారు. సమగ్ర శిక్ష ఔట్‌సోర్సింగ్ ఫెడరేషన్ ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా అక్టోబర్ 12న దశాబ్ద ఐక్యత – భవిష్యత్ పోరాట సభ విజయవాడలోని ఎంబీవీకే కేంద్రంలో నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు అంతా పాల్గొనాల ని పిలుపునిచ్చారు. జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.గోవిందరావు, రాష్ట్ర కన్వీనర్ వి.రమేష్, నియోజకవర్గ బాధ్యులు కృష్ణప్రసాద్, గణపతి, జ్యోతి, కిర ణ్, నాయుడు, రామారావు, శ్రీనివాసరావు, లక్ష్మి, పార్వతి, రాము తదితరులు పాల్గొన్నారు.