
బాలల చట్టాల అమలులో సమస్యలు
విజయనగరం లీగల్: రాష్ట్రంలో బాలల న్యాయ, బాలల పరిరక్షణ చట్టాల అమలులో ప్రధాన సమస్యలున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షురా ఎం. బబిత అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో బాలల న్యాయ, బాలల పరిరక్షణ చట్టాల అమలులో ప్రధాన సమస్యలు అనే అంశంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు శనివారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షురాలు, ప్రధాన న్యాయమూర్తి ఎంబబిత పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా నిధుల కొరత, అవగాహన లేకపోవడం, సిబ్బంది కొరత, ప్రత్యేక పోలీస్ యూనిట్ల లోపం ,శిక్షణ పొందిన మానవ వనరుల కొరత, సతి గృహాల కొరత వంటివి ప్రధాన సమస్యలుగా, సవాళ్లుగా ఉన్నాయన్నారు. మొదటి సమస్య నిధుల కొరత అని, బాలల పరిరక్షణ కార్యక్రమాలకు, వసతి గృహాల నిర్వహణకు అవసరమైన నిధుల కొరత ఉందన్నారు. అదేవిధంగా చట్టాలు ప్రభుత్వ పథకాలు, బాలల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందన్నారు. కార్యక్రమంలో స్పెషల్స్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థల ఇన్‌చార్జ్ కార్యదర్శి లక్ష్మీకుమారి, మహిళా పోలీస్ స్టేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ గోవిందరావు బాలలకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థలు, జోనల్ జస్టిస్ బోర్డు ప్యానల్ న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత