
త్రుటిలో తప్పిన ప్రమాదం
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ కూడలి వద్ద ఓ మహిళ పసిపాపతో రిక్షాలో వెళ్తున్న క్రమంలో రిక్షాను వెనకనుంచి లారీ ఢీకొట్టడంతో రిక్షా చక్రం రహదారిపై ఉన్న గుంతలో ఒక్కసారిగా దిగిపోయింది. దీంతో రిక్షా ఒక్కసారిగా పక్కకు వాలిపోవడంతో రిక్షాలో ఉన్న మహిళ, పసిపాప రోడ్డుపై పడి తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రిక్షాకు ఉన్న చక్రం గుంతలో దిగి ధ్వంసమైంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులంతా భావించారు.
రిక్షాను పక్కకు తీసేందుకు
సాయం చేస్తున్న స్థానికులు