
● అందరికీ అందని ఎరువు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ గ్రామంలో ఎరువుల కోసం రైతులు శనివారం గంటల తరబడి నిరీక్షించారు. స్థానిక సత్యనారాయణ ట్రేడర్స్‌లో వ్యవసాయ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో యూరియా పంపిణీ ప్రారంభించగా వందలాది మంది రైతులు తరలివచ్చారు. తొలుత ఆధార్ కార్డు తెచ్చి లైన్‌లో పడిగాపులు కాయగా.. ఆ తరువాత వన్‌బీ తేవాలని సిబ్బంది ఆంక్షలు పెట్టడంతో ఇళ్లకు పరుగు తీశారు. ఒక్కో బస్తాపై రూ.30 నుంచి రూ.40 వరకు వసూలు చేసినట్టు రైతులు ఆరోపించారు. ఎరువుకోసం 500 రైతులు తరలిరాగా 267 మందికే ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. మిగిలిన వారు నిరాశతో వెనుదిరిగారు.