ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు.. | - | Sakshi
Sakshi News home page

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు..

Sep 7 2025 7:05 AM | Updated on Sep 7 2025 7:05 AM

ఓట్లే

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు..

9న ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ‘ఎరువుల బ్లాక్‌ మార్కెట్‌పై అన్నదాత పోరు’

విజయనగరం/బొబ్బిలి: అబద్ధపు హమీలను నమ్మి ఓట్లేసిన పాపానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రైతాంగం రోడ్లెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలోని రైతులంతా ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమోత్తారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు క్యూలైన్‌లలో నిలబడాలా అంటూ ప్రశ్నించారు. ఎన్నడూ లేని విధంగా వేకువజామున 4 గంటల నుంచి క్యూలైన్‌లలో నిల్చొనే దుస్థితి దాపురించడం ప్రభుత్వ రైతు వ్యతిరేక పనితీరుకు అద్దంపడుతోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 9న రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల ఎదుట తలపెట్టిన ‘ఎరువుల బ్లాక్‌ మార్కెట్‌పై అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్లను విజయనగరం, నెల్లిమర్ల, ఎస్‌.కోట, బొబ్బిలి నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్సీతో కలిసి శనివారం ఆవిష్కరించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల నివాసంలోను, బొబ్బిలిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గాల ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఈనెల 9న విజయనగరం జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి నిరసనలు చేపట్టి అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. విజయనగరం రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఎదుట చేపట్టే ఆందోళనకు విజయనగరం, నెల్లిమర్ల, ఎస్‌.కోట నియోజకవర్గాలకు చెందిన రైతులు, నాయకులు, కార్యకర్తలు, బొబ్బిలి రెవెన్యూ కార్యాలయం వద్ద చేపట్టే ఆందోళనకు బొబ్బిలి, గజపతినగరం నియోజకవర్గాలకు చెందిన నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా మహాత్మాజ్యోతీరావుపూలే విగ్రహం నుంచి కలెక్టరేట్‌ కూడలి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు అన్నదాత పోరు నిరసన ర్యాలీ కొనసాగుతుందన్నారు. అనంతరం ఆర్డీఓకు రైతు సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వినతిపత్రం అందజేస్తామన్నారు.

● మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హమీలు చేయకుండా ప్రజలను మోసం చేయడం, ఎరువుల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందని దుయ్యబట్టారు. 9న తలపెట్టిన అన్నదాత పోరును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, రైతులకు పిలుపునిచ్చారు.

● ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్స సురేష్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతలకు తీరని అన్యాయం జరుగుతుందని విమర్శించారు. యూరియా ఎక్కువగా వాడితే క్యాన్సర్‌ వస్తుందంటూ చెప్పడంలోనే ఆయన వ్యవసాయానికి ఇచ్చే ప్రాధాన్యం అర్ధమవుతుందన్నారు. గంటల తరబడి లైన్‌లలో నిల్చొన్నా ఒక బస్తా యూరియా దొరకక రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు.

● ఎస్‌కోట నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రతిపక్ష పార్టీ పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. రైతంగాం కోసం చేపడుతున్న కార్యక్రమంలో ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు.

● నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువుల కోసం రైతులు గగ్గోలు పెడుతుంటే కూటమి నేతలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఏదో చేస్తానంటూ గొప్పలు చెప్పి తనకు డిప్యూటీ సీఎం పదవిని, వాళ్ల అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ పదవులు తెచ్చుకుని అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.

● మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ వ్యవసాయం దండగ అనే చంద్రబాబుకు రైతులు కష్టాలపై స్పందించకపోవడంలో ఆశ్చర్యంలేదన్నారు. చంద్రబాబు తీరును రైతులు గుర్తించాలన్నారు.

● మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ వ్యవసాయం దండగని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతులకు అవస్థలు తప్పవన్నారు. ఆయన హయాంలో ఎరువులు, విత్తనాల కోసం దెబ్బలు కాయాల్సిన దుస్థితి ఉంటుందన్నారు. కార్యక్రమాల్లో రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు మంత్రి అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధా న కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు శెట్టివీరవెంకటరాజేష్‌, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్‌, బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రైతన్నలను కించపరిచేలా వ్యవసాయశాఖ మంత్రి వ్యాఖ్యలు

కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు సంబంధిత శాఖ బాధ్యతలు చూస్తున్న మంత్రికి రైతన్నలంటే అవహేళనగా మారిపోయిందని మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తూ, ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులను కించపరిచేలా మాట్లాడడం తగదన్నారు. క్యూలో నిలబడిన రైతులను ఉద్దేశించి ‘బఫే భోజనానికి వెళ్లేటప్పుడు నిలబడలేదా..? ఎందుకు నిలబడరు?‘ అంటూ రైతులను చులకనగా చేసి మాట్లాడడం దురదృష్టకరమన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన మేరకు పుష్కలంగా ఎరువులు, విత్తనాలను అందించామని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖమంత్రి సొంత గ్రామమైన నిమ్మాడలో వైఎస్సార్‌సీపీ హయాంలో ఏ ఒక్క రైతైనా ఎరువు కోసం వేచి చూసి, క్యూలో నిలబడిన పరిస్థితులు ఉన్నాయా..? అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. మద్దతు ధరలు లేక మిర్చి, మామిడి, పొగాకు, ఉల్లి, చీనీ, టమాటా రైతులు సైతం రోడ్డెక్కి రోదిస్తున్న పరిస్థితులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారని, రెండో ఏడాదికి సంబంధించి అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

విత్తనాలు, ఎరువుల కోసం రైతులు

మండుటెండలో నిలబడాలా..?

రైతన్నలను కించపరిచేలా వ్యవసాయ శాఖ మంత్రి వాఖ్యలు

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పిలుపు

విజయనగరం, ఎస్‌కోట, నెల్లిమర్ల, బొబ్బిలి నియోజకవర్గాల

ముఖ్య నాయకులతో సమావేశం

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు.. 1
1/7

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు..

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు.. 2
2/7

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు..

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు.. 3
3/7

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు..

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు.. 4
4/7

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు..

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు.. 5
5/7

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు..

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు.. 6
6/7

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు..

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు.. 7
7/7

ఓట్లేసిన పాపానికి రోడ్లు ఎక్కిస్తున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement