
తోటపల్లి నీరందేలా చూడండి
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్,
డాక్టర్ తలే రాజేష్
రాజాం సిటీ: తోటపల్లి ప్రాజెక్టు కాలువ నుంచి సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్ కోరారు. రాజాంలోని తోటపల్లి ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజాం, రేగిడి మండలాల్లోని సుమారు 20 గ్రామాలకు సాగునీరు సరఫరా కావడంలేదన్నారు. ఉభాలు ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. అటు ప్రభుత్వం, ఇటు అధికారులు రైతులతో ఆడుకోవడం మంచిపద్ధతి కాదని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బ్రాంచి కెనాల్‌లో నీటిని విడిచిపెట్టాలని కోరారు. కార్యక్రమంలో లావేటి రాజగోపాలనాయుడు, పాలవలస శ్రీనివాసరావు, టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, ఉత్తరావిల్లి సురేష్‌ముఖర్జీ, వాకముళ్లు చిన్నంనాయుడు, బి.నరేంద్ర పాల్గొన్నారు.