
నేడు ఆలయాల మూసివేత
నెల్లిమర్ల రూరల్: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రామతీర్థం సీతారామస్వామివారి దేవస్థానాన్ని ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మూసివేస్తామని, గ్రహణ సంప్రోక్షణ కార్యక్రమం పూర్తి చేసి సోమవారం ఉదయం 11.30 దాటిన తరువాత స్వామివారి దర్శనభాగ్యం భక్తులకు కల్పిస్తామని ఈఓ వై.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం రాత్రి 9.50 కు సంపూర్ణ చంద్రగ్రహణం పడుతుందన్నారు. భక్తులు ఈ అంతరాయాన్ని గమనించాలని కోరారు.
పైడితల్లి ఆలయం మూసివేత
విజయనగరం టౌన్: చంద్రగ్రహణం సందర్భంగా పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు దేవాలయం మూసివేసి, సంప్రోక్షణ అనంతరం తిరిగి సోమవారం ఉదయం 8.30 గంటలకు తెరవబడుతుందని ఆలయ ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష శనివారం ప్రకటనలో తెలిపారు.