ఉపాధ్యాయ వృత్తి ఓ సామాజిక బాధ్యత | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ వృత్తి ఓ సామాజిక బాధ్యత

Sep 6 2025 7:11 AM | Updated on Sep 6 2025 7:11 AM

ఉపాధ్యాయ వృత్తి ఓ సామాజిక బాధ్యత

ఉపాధ్యాయ వృత్తి ఓ సామాజిక బాధ్యత

విజయనగరం అర్బన్‌:

మాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది వృత్తికాదని.. వారిది సామాజిక బాధ్యతని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించిన ఉపాధ్యాయులను సత్కరించుకోవడమే మన తొలి ప్రాధాన్యమన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌ ఆడిటోరియంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సమాజంలో గౌరవ ప్రదమైన వారని, వారిని సన్మాంచుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా హజరైనఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ ప్రపంచంలో గొప్పవారినందరినీ తీర్చిద్దినది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు ఎప్పుడూ సూపర్‌ హీరోనే అని పేర్కొన్నారు. విద్యార్థులు ఏ స్థాయికి ఎదిగినా గురువుని తల్లిదండ్రులతో పాటు గుర్తు పెట్టుకుంటారని, అంతటి గొప్ప వృత్తి ఉపాధ్యాయునిదని కొనియాడారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్‌ గాదె శ్రీనివాసులునాయుడు మాట్లాడుడూ బోధనాంశాలతో పాటు నైతిక విలువులు, మన సంస్కృతీ సంప్రదాయాల గురించి బోధించాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 76 మందిని సత్కరించారు. సభకు అధ్యక్షుత వహించిన డీఈఓ యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత దైవంగా కొలిచే ఉపాధ్యాయుడు తరగతిగదిలో పిల్లల భవిష్యత్తును తీర్చే బాధ్యతను తీసుకోవడం జరుగతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి..

ఉపాధ్యాయులను సత్కరించాల్సిన పవిత్రమైన ఉత్సవంలో ప్రోటోకాల్‌ పాటించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని ఇద్దరు శాసన మండలి సభ్యులను పక్కనపెట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేను మాత్రమే విశిష్ట అతిథిగా ఆహ్వానించి సత్కారాలు నిర్వహించడంపై ఉపాధ్యాయులు విస్తుపోయారు. తాము ఎన్నుకున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి తొలి ప్రాధాన్యం ఇవ్వకుండా ఒక ఎమ్మెల్యేకి ఇవ్వడం అంటే ఉపాధ్యాయులను అగౌరవ పరచడమేనని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయుల స్పూర్తిని తోటి ఉపాధ్యాయులకు కలిగించే ప్రసంగం చేయకుండా చంద్రబాబు విజన్‌, లోకేశ్‌ పనితీరుపై భజనచేయడాన్ని ఉపాధ్యాయులు తప్పుబట్టారు. ఉపాధ్యాయ సత్కార సభలో రాజకీయ ఉపన్యాసం సరికాదన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

టీచర్‌ ఎప్పుడూ సూపర్‌ హీరోనే:

ఎమ్మెల్సీ సురేష్‌బాబు

విద్యతోపాటు మన సంస్కృతిని

బోధించాలి: ఎమ్మెల్సీ గాదె

గురువులను గౌరవించాల్సిన సభలో చంద్రబాబు భజన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement