
ఘనంగా జెడ్పీ చైర్మన్ జన్మదిన వేడుకలు
విజయనగరం: ఉమ్మడి విజయగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జెడ్పీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ కేక్ కట్‌చేయగా, విజయనగరం, పార్వతీపురం–మన్యం, శ్రీకాకుళం జిల్లాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, జెడ్పీ అధికారులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు, దుశ్శాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, కంబాల జోగులు, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి తలే రాజేష్, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, సంగంరెడ్డి బంగారునాయుడు, రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, విజయనగరం కార్పొరేషన్ కార్పొరేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శలు సీహెచ్ మురళి, రవికుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.