
పరిశ్రమల స్థాపనకు సులభంగా అనుమతులు
విజయనగరం అర్బన్: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసిన వారికి అనుమతులివ్వాలని జేసీ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. గతేడాది సింగల్ డెస్క్ పోర్టల్‌లో 2,257 దరఖాస్తులకు అనుమతులిచ్చి రాష్ట్రంలోనే జిల్లా ఉత్తమ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై గురువారం జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటును అధికారులు ప్రోత్సహించాలన్నారు. కేపీఎన్జీ సంస్థ కన్సల్టెంట్ రవితేజ ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్‌లో ర్యాంక్ రావడానికి తోడ్పడే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈఓడీబీపై కేంద్ర ప్రభుత్వం సర్వేచేస్తోందని, దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి ఐవీఆర్‌ఎస్ ఫోన్ కాల్స్ వస్తాయని, వారు అన్ని శాఖల నుంచి అందిన సహకారంపై వారి అభిప్రాయాన్ని పాజిటివ్‌గా చెప్పేలా పనిచేయాలన్నారు. ఈఓడీబీలో మంచి ర్యాంక్ వస్తే ప్రభుత్వం నుంచి పరిశ్రమల స్థాపనకు ఎక్కువ సహకారం అందుతుందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కరుణాకర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.
జేసీ సేతు మాధవన్