
6న చలో విజయవాడ
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 6తేదీన ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి డి.రాము, సీహెచ్. వెంకటేష్‌లు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎల్బీజీ భవన్‌లో ప్రచార పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15నెలలు గడిచింది. కానీ విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని విమర్శించారు. ప్రధానంగా జిల్లాలో ఐదేళ్ల క్రితం ఏర్పడిన విజయనగరం, రాజాం, గజపతినగరం డిగ్రీ కళాశాలలకు దిక్కుమొక్కు లేకుండా పోయిందని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.6,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసి డిగ్రీ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పలు డిమాండ్స్ సాధన కోసం జరుగుతున్న చలో విజయవాడ కార్యక్రమంలో జిల్లా విద్యార్థులంతా వేలాదిగా పాల్గొని జయపద్రం చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ కృషి చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను ఏకం చేసి పోరాటం నిర్వహిస్తామని, దీనికి విద్యాశాఖ బాధ్యత వహింల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు జె.రవికుమార్, వి.చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్స్ ఆవిష్కరణ