
మా దారి ఇలా... వెళ్లేది ఎలా..?
గిరిజన ఇళ్లకు నిప్పు
చిత్రంలో బురదరోడ్డుపై అష్టకష్టాలు పడుతూ ముందుకు సాగుతున్నది బొబ్బిలి మండలంలోని బొడ్డవలస, గోపాలరాయుడుపేట పంచాయతీల పరిధిలోని అక్కేనవలస, బట్టివలస, కొత్తబట్టివలస, కొత్తవలస తదితర గిరిజన గ్రామాల చిన్నారులు. వీరంతా ప్రతిరోజు సీహెచ్ బొడ్డవలస నుంచి అక్కేనవసలస వరకు ఉన్న బురద రోడ్డుపై వెంకట్రాయుడిపేట పాఠశాలకు రాకపోకలు సాగిస్తారు. వర్షాలకు రోడ్డు నడిచేందుకు కూడా వీలులేని స్థితికి చేరడంతో చిన్నారులు
అవస్థలు పడుతున్నారు. జారుతూ, పడుతూ ముందుకు సాగుతున్నారు. రోడ్డు కష్టాలు తీర్చాలంటూ పాలకులు, అధికారులను వేడుకుంటున్నారు. – బొబ్బిలిరూరల్
వీరఘట్టం: మండలంలోని పెద్ద గదబవలస పంచాయతీ పరిధిలో గదబవలస కాలనీకి కొద్ది దూరంలో గిరిజనులు వేసుకున్న ఐదు పూరిళ్లకు గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం నిప్పుపెట్టారు. పూరిళ్లన్నీ కాలిబూడిదయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జి.కళాధర్ తెలిపారు. గదబవలస కాలనీకి సందిమానుగూడకు మధ్యలోని ప్రభుత్వ స్థలాన్ని సందిమానుగూడకు చెందిన గిరిజనులకు ఐటీడీఏ గతంలో డీ పట్టాలు ఇచ్చింది. అదే స్థలంలో గదబవలస కాలనీకి చెందిన కొంత మంది అక్రమంగా గుడెసెలు వేశారు. దీనిపై పట్టాదారులు ఫిర్యాదు చేయడంతో ఈ ఏడాది జనవరిలో తొలగించారు. మళ్లీ గదబవలస కాలనీకి చెందిన కొంత మంది ఈ ఏడాది మార్చి నెలలో ఇక్కడ మరలా గుడెసెలు వేశారు. ప్రస్తుతం వాటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టినట్టు ఎస్‌ఐ తెలిపారు.

మా దారి ఇలా... వెళ్లేది ఎలా..?