
సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు బదిలీ
విజయనగరంఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు ఉద్యోగోన్నతిపై శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ అయింది. ఆయన స్థానంలో పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ బాధతలు స్వీకరించనున్నారు.
పెరుగుతున్న మడ్డువలస నీటిమట్టం
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు నీటితాకిడి పెరిగింది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి బుధవారం 7వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 63.32 మీటర్ల నీటిమట్టం నమోదైంది. రెండు గేట్లు ఎత్తి 5వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడున్నామని ఏఈ నితిన్ తెలిపారు. 600 క్యూసెక్కుల నీటిని కుడి ప్రధాన కాలువ ద్వారా పంటపొలాలకు సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు.
బడిదేవరకొండ గ్రానైట్ లైసెన్స్ రద్దుకు డిమాండ్
● కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన
ఏపీ రైతు సంఘం నాయకులు
పార్వతీపురం రూరల్: బడిదేవరకొండ గ్రానైట్ లైసెన్స్‌ను రద్దుచేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వెలగవలస చెరువును గ్రానైట్ బూడిదతో నింపేసి చేపల వేటకు వెళ్లిన మత్స్యాకారుడు పాడి బంగారిదొర మృతికి గ్రానైట్ కంపెనీయే కారణమని ఆరోపించారు. బంగారిదొర కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేసి యజమానిని అరెస్టు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు పాల్గొన్నారు.

సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు బదిలీ