
కూనేటి గెడ్డకు గండి
● ప్రభుత్వం స్పందించి గండిని పూడ్చాలి
● మాజీ ఉపముఖ్యమంత్రి పీడీక రాజన్నదొర
మెంటాడ: మండలంలోని బడేవలస వద్ద కూనేటి గెడ్డకు బుధవారం వేకువజామున గండిపడింది. సుమారు 13 మీటర్ల వెడల్పున గట్టు కోరుకుపోయింది. గెడ్డ నీరు పొలాలపై ప్రవహించడంతో 50 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లింది. బడేవలసకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు మీసాల గురునాయుడు సమాచారంతో మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొర గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్లు స్పందించి గండిని పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని కోరారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.