
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు డీఏవీ విద్యార్థులు
రాజాం సిటీ: త్వరలో నెల్లూరు, ఒంగోలులో జరగనున్న రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు రాజాంలోని డీఏవీ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ మంగళవారం తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో శ్రీకాకుళం మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరిగాయన్నారు. ఈ పోటీల్లో అండర్ లెవెన్ సింగిల్స్‌లో బి.పుష్కర్ ప్రథమ బహుమతి సాధించగా, రన్నరప్‌గా యు.కౌశిక్‌నాయుడు నిలిచాడని చెప్పారు. అండర్ లెవెన్ డబుల్స్ విన్నర్‌గా బి.పుష్కర్, యు.కౌశిక్‌నాయుడులు నిలిచారు. అండర్–13 బాలికల విభాగంలో పి.నిషిక, పి.లాస్యప్రియ, బాలుర విభాగంలో పి.గోవర్ధన్, అన్షుమాన్‌లు ద్వితీయ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వారి ఎంపికపట్ల జీఎంఆర్ వీఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, పీఈటీ అప్పలనాయుడు, కోచ్ పప్పల తిరుపతిరావు తదితరులు హర్హం వ్యక్తం చేశారు.