
జొన్నవలస రైల్వేగేటు వద్ద మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: జొన్నవలస రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని జీఆర్‌పీ పోలీసులు శనివారం గుర్తించారు. 25 – 30 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తి నీలి రంగు ఫ్యాంట్, రెడ్ నెక్ టీ షర్ట్ కలిగిన వ్యక్తిగా గుర్తించినట్టు జీఆర్‌పీ హెచ్‌సీ కృష్ణ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. గుర్తించిన వారు తమను సంప్రదించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ పరిధి నవోదయ విద్యాలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురు యువకులు గాయాల పాలయ్యారు. స్థానికులు అందించిన వివరాలు.. మండలంలోని లచ్చందొరపాలెం గ్రామానికి చెందిన కండిపల్లి సుధీర్(18) తన స్నేహితులతో కలిసి బొడ్డవర పంచాయతీ అంబదాసుపాలెం గ్రామానికి చెందిన నిఖిల్ ఆటోలో శుక్రవారం రాత్రి ముషిడిపల్లి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో నవోదయ విద్యాలయం దాటగానే ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో సుధీర్ ప్రమాద స్థలంలో మృతి చెందగా, ఆటో నడుపుతున్న నిఖిల్, గణేష్, జగదీష్ గాయపడ్డారు. వీరిని ఎస్‌కోట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వీరిలో గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఎస్.కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జొన్నవలస రైల్వేగేటు వద్ద మృతదేహం లభ్యం