
జిందాల్ రైతులకు చట్టప్రకారమే పరిహారం
విజయనగరం అర్బన్:
జిందాల్ కంపెనీకి భూములిచ్చి పరిహారం అందని రైతులకు వారం రోజుల్లో అందజేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిందాల్‌కు కేటాయించిన భూములపై తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. ఇప్పటి వరకు చెల్లించిన పరిహారం, పెండింగ్ బకాయిలపైనా ఆరా తీశారు. సుమారు 28 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి 15 మంది రైతులకు మాత్రమే పరిహారం పెండింగ్ ఉండగా వీరిలో ముగ్గురికి ఇటీవలే చెల్లించినట్లు అధికారులు వివరించారు.
మిగిలిన 11 మందికి వారంలో పరిహారాన్ని అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూములు తీసుకున్న సమయంలో ప్రభు త్వం నిర్ణయించిన పరిహారం మాత్రమే వారికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. 53 బోరుబావులకు సంబంధించి ఇప్పటికే 28 మందికి నష్ట పరిహారం ఇచ్చామన్నారు. ఇళ్ల స్థలాలు కోల్పోయిన 16 మందికి నిబంధనల ప్రకా రం పరిహారం ఇవ్వాలన్నారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓ డి.కీర్తి, ఎస్.కోట తహసీల్దార్ డి.శ్రీనివాసరావు, డి–సెక్షన్ సూపరింటిండెంట్ తాడ్డి గోవింద తదితరులు పాల్గొన్నారు.
ప్లకార్డును ప్రదర్శిస్తున్న విద్యార్థిని
కలెక్టరేట్ ముఖద్వారం వద్ద బైఠాయించి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్న విద్యార్థులు
హామీ ఏమైంది?
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ యువగళం కార్యక్రమంలో జీఓ నంబర్ 117 రద్దుచేసి పాఠశాల విద్యావ్యవస్థను సమూలంగా మారుస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారు. పాఠశాలలు మూతపడుతున్నా స్పందన లేదు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లన్నీ ప్రభుత్వం పరిధిలో ఉంచుతామని హామీ ఇచ్చి నేడు అమ్మకానికి పెడుతున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దారుణం. హాస్టల్ మెస్ చార్జీలు పెంచుతామన్న మాటనూ మర్చిపోవడం విచారకరం.
– నాగభూషణం, ఏఐఎస్‌ఎఫ్
జిల్లా కార్యదర్మి, విజయనగరం
పత్తాలేని ఫీజు రీయింబర్స్‌మెంట్
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేయడంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారింది. పేద విద్యార్ధులకు ఉన్నత చదువులు ప్రశ్నార్థకంగా మారాయి.
– ఏ.సుమన్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు,
విజయనగరం
సమస్యల పరిష్కారంలో విఫలం
విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కనీసం పట్టించుకోవడంలేదు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్ధల్లో లక్ష రూపాయల ఫీజు దోపిడీ జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు.
– వి.శ్రావణ్ కుమార్, ఏఐఎస్‌ఎఫ్
జిల్లా సహాయ కార్యదర్మి, విజయనగరం
● విద్యార్థుల నిరసనలతో దద్దరిల్లిన కలెక్టరేట్
● విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలం
● నిరసనగళం వినిపించిన విద్యార్థులు
విజయనగరం గంటస్తంభం:
కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ విద్యార్థి లోకం గర్జించింది. కల్టెరేట్‌ను చుట్టుముట్టి తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినదించింది. నిరసన గళం వినిపించింది. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ర్యాలీగా వందలాది మంది విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ప్రవేశం ద్వారం వద్ద ధర్నా చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. తమ డిమాండ్లను వినిపిస్తూ డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ... కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఫీజు నియంత్ర చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.6,400 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. దీనివల్ల ఇంజినీరింగ్, పీజీ కోర్సులు పూర్తిచేసినా విద్యార్థుల చేతికి సర్టిఫికెట్లు ఇవ్వడంలేదన్నారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ నంబర్ 77, రాష్ట్రవ్యాప్తంగా పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను రద్దుచేసి పాత పద్ధతిలోనే యూనివర్సిటీ సెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ నిలిపివేసి ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని కోరారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే జీఓ నంబర్ 107, 108 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, వర్సిటీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు వసతులు కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడతామని హెచ్చరించారు.
సమీక్షించిన కలెక్టర్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సునీల్ బంట, నాతు సింగ్ ఆధ్వర్యంలోని కేంద్ర బృందం పరిశీలించింది. జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, విజయనగరరం మండలాల్లో పర్యటించి పథకాల అమలుపై ఆరా తీసింది. ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులు బృందానికి సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిందాల్ రైతులకు చట్టప్రకారమే పరిహారం

జిందాల్ రైతులకు చట్టప్రకారమే పరిహారం