
జేఎన్‌టీయూ జీవీకి ప్రశంసాపత్రం
విజయనగరం అర్బన్: ఢిల్లీకి చెందిన యూజీసీ–మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ (యూజీసీ–ఎంఎంటీటీసీ) ఆధ్వర్యంలో ఫిబ్ర వరి 4– 14, జూన్ 3–13 రెండుదశల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఎన్‌ఈపీ ఓరియంటేషన్ ప్రోగ్రాంను జేఎన్‌టీయూ విజయవంతంగా పూర్తిచేసి ప్రశంసా పత్రాన్ని సొంతం చేసుకుంది. యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమతో పాటు యూనివర్సిటీ ఇంజినీరింగ్ అధ్యాపకుల బృందం ప్రోగ్రాంలో పాల్గొంది.
ఆశ వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలి
● ఆశ వర్కర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి
విజయనగరం ఫోర్ట్: ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని ఆశ వర్కర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్‌పీఆర్ భవన్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఆశ వర్కర్ల సంఘం సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2024 పిభ్రవరి 9న ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఒప్పందాలను అమలుచేయాలన్నారు. ప్రభుత్వ సెలవులతోపాటు, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని తెలిపారు. రిటైర్‌మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధారాణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకరరావు, కార్యదర్శి సురేష్, తదితరులు పాల్గొన్నారు.