
రూ.3 లక్షల విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ95 శ్రీ160 శ్రీ170
విజయనగరం క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ 3పై ఓ వ్యక్తి నుంచి వెండి ఆభరణాలను జీఆర్పీ సిబ్బంది బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా సోం పేటకు చెందిన ప్రవీణ్ సింగ్ ఒక బ్యాగ్‌లో సుమారు రూ.3 లక్షలు విలువ చేసే పది కేజీల వెండి ఆభరణాలను పట్టుకెళ్తున్నట్లు సమాచారం అందగా శ్రీకాకుళం నుంచి విజయనగరం వచ్చే రైలులో దిగిన ప్రవీణ్‌ను పట్టుకుని విచారణ చేయగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో తమదైన శైలిలో విచారణ చేసి రవాణా చేస్తున్న ఆభరణాలకు ఎలాంటి రుసుము, ఆధారాలు లేకపోవడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నామని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
సోంపేటకు చెందిన వ్యక్తి అరెస్ట్