
ఉత్తరాంధ్ర కీర్తిని నిలిపిన నేత
● జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ‘బొత్స’
● ఘనంగా బొత్స జన్మదిన వేడుకలు
చీపురుపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కీర్తిని ఇనుమడింపజేసిన ఘనత శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు దక్కిందని, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు ఉత్తరాంధ్ర పేరు చెబితే బొత్స గుర్తుకొచ్చే విధంగా పరిపాలన సాగించారని జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని బుధవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ కల్యాణ మంటపంలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్‌ను ప్రారంభించిన అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం హ్యాపీ బర్త్‌డే బొత్స అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాను ఎంతో అభివృద్ధి పథంలో నడిపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరుగులేని నాయకుడిగా ఎదిగిన బొత్స నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడాలన్నారు.
మెడికల్ క్యాంప్‌లో 350 మందికి వైద్య పరీక్షలు
ఇదిలా ఉండగా ‘బొత్స’ జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. శ్రీకాకుళానికి చెందిన జెమ్స్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది హాజరై వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 350 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీతో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి వెళ్లి పూజలు నిర్వహించారు. బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు పెట్టించి, ప్రభుత్వ రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విజయనగరం పార్లమెంటరీ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్‌లు ఎస్‌వీ.రమణరాజు, కేవీ.సూర్యనారాయణరాజు, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల పార్టీ అధ్యక్షులు మీసాల వరహాలనాయుడు, మీసాల విశ్వేశ్వరరావు, కోట్ల వెంకటరావు, రాష్ట్ర రైతు విభాగం కాార్యదర్శి దన్నాన జనార్దనరావు, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, వలంటీర్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లాన త్రినాథరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్ర కీర్తిని నిలిపిన నేత