
● గ్యాస్ విడిపించి నెలలైనా.. ఖాతాలో పడని నగదు ● జిల్ల
విజయనగరం ఫోర్ట్:
అధికారంలోకి రాగానే మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇస్తాం.. ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తామని కూటమి సర్కార్ గొప్పగా ప్రచారం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే కూటమి సర్కార్ మాట మీద నిలబడలేదనే మహిళలు ఆగ్రహిస్తున్నారు. తొలి ఏడాది మూడు సిలిండర్లకు బదులు ఒక సిలిండర్‌తో సరి పెట్టేసింది. 2025 – 26 సంవత్సరానికి సంబంధించి ఇచ్చే సిలిండర్‌కు సంబంధించి గ్యాస్ బుక్ చేసుకున్న అందరికి కాకుండా కొంతమందికే ఉచిత గ్యాస్ డబ్బులు జమ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఇచ్చిన ఒక్క సిలిండర్ అయినా గ్యాస్ బుక్ చేసినా లబ్ధిదారులు అందరికి సబ్సిడీ (రాయితీ) ఇచ్చారంటే అదీ లేదు. అందులో చాలా మందికి రాయితీ ఇవ్వలేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి.
జిల్లాలో లబ్ధిదారులు 5.02 లక్షలు
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 6 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్ కోసం ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులు 5,02,654 మంది. ఇందు లో 2025 – 26 సంవత్సరానికి సంబంధించి ఏప్రి ల్ నుంచి జూన్ నెలాఖరు నాటికి 3,95,419 మంది లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నారు. ఇందు లో 3,40,599 మందికి ప్రభుత్వం రాయితీ నిధులు విడుదల చేసింది. అయితే 3,38,770 మందికి మాత్రమే రాయితీ నిధులు వారి ఖాతాల్లో జమ య్యాయి. 54,820 గ్యాస్ తీసుకున్నప్పటకీ నిధులు విడుదల కాలేదు. గ్యాస్ రాయితీ విడుదల చేసిన దాంట్లో కూడా 1829 మందికి వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. గ్యాస్ రాయితీ కింద రూ. 26,82,16,233 విడుదల చేయగా లబ్ధిదారుల ఖాతాల్లో 16,66,78,779 నిధులు జమయ్యాయి. రూ.15,37,454 నిధులు జమ కాలేదు.
గ్యాస్ లబ్ధిదారుల వివరాలు
జిల్లాలో గ్యాస్ బుక్ చేసుకున్న భారత్ గ్యాస్ లబ్ధిదారులు 46,949 మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. వీరిలో రాయితీ నిధులు 30,208 మందికి విడుదల అయ్యాయి. హెచ్‌పీ గ్యాస్ లబ్ధిదారులు 2,88,232 మందికి గ్యాస్ బుక్ చేసుకున్నారు. వీరిలో 2,64,444 మందికి రాయితీ నిధులు విడుదల అయ్యాయి. ఇండియన్ గ్యాస్ లబ్ధిదారులు 60,238 మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. 45,947 మందికి రాయితీ నిధులు విడుదల అయ్యాయి.
వివిధ కారణాలతో లబ్ధిదారుల్లో కోత
వివిధ కారణాలతో కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ రాయితీని తగ్గించుకోవాలని చూస్తుందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందని కొందరికి, ఇంట్లో అంగన్ వాడీ కార్యకర్త, ఆశ కార్యకర్త వంటి చిరుద్యోగులు ఉన్నారని మరి కొందరికి ఇలా అనేక కారణాలతో లబ్ధిదారులకు అందించాల్సిన ఉచిత రాయితీని ప్రభుత్వం ఎగ్గొంటేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
నెలాఖరులోగా జమ
ఉచిత గ్యాస్ రాయితీకి సంబంధించి 3,95,419 మంది గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారు. వీరిలో 3,40,599 మందికి జూన్ నెలఖారు నాటికి రాయితీ నిధులు విడుదల అయ్యాయి. జూలై నెలాఖరు వరకు సమయం ఉన్నందున మిగతా వారికి కూడా డబ్బులు జమ అవుతాయి.
– కె.మధుసూదన్‌రావు,
జిల్లా పౌర సరఫరాల అధికారి

● గ్యాస్ విడిపించి నెలలైనా.. ఖాతాలో పడని నగదు ● జిల్ల