
అధికం..!
బదిలీలకు పాయింట్ల కేటాయింపు ఇలా...
తప్పనిసరి బదిలీలే
పాఠశాలలున్న ప్రాంతాల సౌకర్యాలను బట్టి జిల్లాలో విభజించిన నాలుగు కేటగిరీలకు బదిలీ చట్టం ప్రకారం పాయింట్లను కేటాయించారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఆ పాఠశాల కేటగిరీ ఆధారంగా ఉపాధ్యాయులకు బదిలీలో పాయింట్లు కేటాయించారు. కేటగిరీ–1 స్కూళ్లలో పనిచేసిన ఉపాధ్యాయులకు ఏడాదికి ఒక పాయింట్, కేటగిరీ–2 స్కూల్‌లో పనిచేసిన ఉపాధ్యాయులకు ఏడాదికి రెండు పాయింట్లు కేటాయించారు. అలాగే, కేటగిరీ–3 స్కూల్‌కి 3, కేటగిరీ–4 స్కూల్‌కి మాత్రం 5 పాయింట్లు ఇస్తారు. ఇలా.. కేటగిరీ–4లో ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి అత్యధికంగా 40 పాయింట్లు లభిస్తాయి. వీరికి బదిలీల్లో తొలిప్రాధాన్యం ఉంటుంది.
పారదర్శకంగా నిర్వహిస్తాం
ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం. ఎక్కడా తప్పులు జరగకుండా పకడ్బందీగా చేపడతాం. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తాం.
– యు.మాణిక్యంనాయుడు, డీఈఓ
●
విజయనగరం అర్బన్:
ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి, బదిలీల ప్రక్రియను విద్యాశాఖ ఇప్పటికే ప్రారంభించింది. బదిలీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కేటగిరీ వారీగా జరుగుతోంది. ఎనిమిదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉపాధ్యాయులకు మాత్రమే తప్పనిసరి బదిలీ వర్తించినప్పటికీ, రేషనలైజేషన్ జీఓ అమలు నేపథ్యంలో స్థానచలనం జరిగే ఉపాధ్యాయుల సంఖ్య పెరగనుంది. విద్యార్థుల సంఖ్య తగ్గడం, గడిచిన విద్యాసంవత్సర చివరి నెల విద్యార్థుల నమోదు ఆధారంగా ఉపాధ్యాయుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటున్న కారణంగా మిగులు ఉపాధ్యాయుల సంఖ్య పెరగనుంది. మారిన విధానాలతో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఉపాధ్యాయుల్లో 70 శాతం మందికి స్థానచలనం ఉంటుందని అంచనా. ముందుగా ప్రధానోపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 100 మంది ప్రధానోపాధ్యాయులు బదిలీ ప్రక్రియను వినియోగించుకున్నారు. ఇందులో 26 మంది ఐదేళ్ల సర్వీసు పూర్తికావడంతో బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. శనివారంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఎస్‌జీటీలకు ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.
ప్రిఫరెన్షియల్ కేటగిరీ..
వంద శాతం దృష్టి లోపం, 80 శాతానికి పైగా శారీరక వైకల్యం ఉన్న వారికి ప్రథమ ప్రాధాన్యం, 75 శాతం దృష్టిలోపం, 70–79 శాతం శారీరక వైకల్యం, 70 శాతానికి పైగా వినికిడి లోపం ఉన్న వారికి ద్వితీయ ప్రాధాన్యం, క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, బొనెటీసీ, కిడ్నీ మార్పిడి, వితంతువులు, డయాలసిస్, స్పైనల్ సర్జరీ చేసుకన్న వారు, జీవిత భాగస్వామి, పిల్లలు జువనైల్ డయబెటిస్, తలసీమియా, హీమోఫిలియో, కండరాల క్షీణతతో బాధపడుతున్న వారు, వైద్య చికిత్స పొందుతున్న వారు ఈ కేటగిరీలోకి వస్తారు.
70 శాతానికి మించి ఉపాధ్యాయులకు స్థానచలనం
పరిగణనలోకి విద్యార్థుల హాజరు సంఖ్య
బదిలీలకు కేటగిరీ వారీగా పాయింట్ల కేటాయింపులు
బదిలీలకు కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ

అధికం..!

అధికం..!