
7 రైతు బజార్లు.. రెండే కూలర్లు..!
విజయనగరం ఫోర్ట్: రైతు బజార్లను అభివృద్ధి చేస్తాం... కూరగాయాలు, ఆకు కూరలు విక్రయించుకునే రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని కూటమి నేతలు గొప్పలు చెప్పారు. తీరా ఆచరణలో తుస్సుమనిపిస్తున్నారు. జిల్లాలో
విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ, దాసన్నపేట, పాత ఎంఆర్ ఆస్పత్రి వద్ద, రాజాం, ఎస్.కోట, చీపురుపల్లి, కొఠారుబిల్లి వద్ద కలిపి మొత్తంగా ఏడు రైతు బజార్లు ఉన్నాయి. వీటిలో 300 మంది వరకు రైతులు కూరగాయలు క్రయవిక్రయాలు జరుపుతూ జీవనం సాగిస్తున్నారు. మిగులు కూరగాయలు నిల్వ ఉంచేందుకు అవసరమైన కుబ్జి కూలర్లు మంజూరు చేయాలని పాలకులు, అధికారులకు పలు మార్లు విన్నవించారు. ఒక్కో రైతు బజారుకు రెండు నుంచి మూడు కూలర్లు అందజేయాలని కోరారు. అయితే,
కూటమి ప్రభుత్వం కేవలం విజయనగరంలోని ఆర్‌అండ్‌బీ రైతు బజార్, దాసన్నపేట రైతు బజార్‌కు మాత్రమే ఒక్కొక్కటి చొప్పున కుబ్జికూలర్లు మంజూరు చేసింది. మిగిలిన ఐదు రైతు బజార్లకు మొండిచేయి చూపింది. కూలర్లు మంజూరు చేయాలని ఏడు రైతుబజార్ల రైతులు విన్నవిస్తే కేవలం రెండింటికి ఒక్కో కూలర్‌నే మంజూరు చేయడం తగదంటున్నారు. రైతుల అవసరం మేరకు కూలర్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయంపై మార్కెటింగ్ శాఖ ఎ.డి. బి.రవికిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం రెండు కుబ్జికూలర్లనే ఇచ్చిందన్నారు. వీటిని విజయనగరంలోని ఆర్‌అండ్‌బీ, దాసన్న పేట రైతు బజార్లలో ఏర్పాటుచేశామని చెప్పారు.
ఇదీ కూటమి ప్రభుత్వ నిర్వాకం
ఆవేదనలో రైతన్నలు

7 రైతు బజార్లు.. రెండే కూలర్లు..!