సికిల్‌సెల్ ఎనిమియాతో తస్మాత్...
● డీఎంహెచ్‌వో డాక్టర్ జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: సికిల్‌సెల్ ఎనిమియా వ్యాధిని త్వరగా గుర్తించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నేషనల్ సికిల్‌సెల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సికిల్‌సెల్ ఎనిమియాపై జిల్లా లోని పీహెచ్‌సీల వైద్యాధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో శనివారం ఆమె పాల్గొని మాట్లాడారు. సికిల్‌సెల్ ఎనిమియా వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా పని చేయాలన్నారు. సికిల్‌సెల్ ఎనిమియా వ్యాధిగ్రస్తులకు రక్తం తగ్గిన వెంటనే మళ్లీ ఎక్కించాలన్నారు. ఎంఎల్‌హెచ్‌పీలకు, ఏఎన్‌ఎంలకు వైద్యాధికారులు శిక్షణ ఇవ్వాలన్నారు. శిక్షణలో డీఎల్‌వో డాక్టర్ కె.రాణి, డాక్టర్ అర్చనదేవి, డాక్టర్ కిషోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


