
పక్షుల దాహార్తి తీర్చేలా..
విజయనగరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, సంస్థల ఆధ్వర్యంలో శనివారం ‘స్వచ్ఛాంధ్ర –స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉష్టతాపం నుంచి ఉపశమనం (బీట్ ది హీట్) సంకల్పంతో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటుచేశారు. వేతనదారులకు టెంట్‌లతో నీడ కల్పించారు.
పక్షుల దాహార్తిని తీర్చేందుకు మట్టికుండల్లో నీటిని నింపి చెట్లకు వేలాడదీశారు. ద్వారపూడి వెల్‌నెస్ సెంటర్‌లో ప్రభుత్వ వైద్యకళాశాల ఆధ్వర్యలో తాగునీటి ఏటీఎంను ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణలో 150 లీటర్ల మజ్జిగ పంపిణీ చేయగా, గ్రీన్ బిల్డింగ్ చేయడానికి పీసీబీ రీజనల్ కార్యాలయంలో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.