అధికారులంతా పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులంతా పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావాలి

May 20 2025 1:13 AM | Updated on May 20 2025 1:13 AM

అధికారులంతా పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావాలి

అధికారులంతా పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావాలి

కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌అంబేడ్కర్‌

పీజీఆర్‌ఎస్‌కు 154 వినతులు

విజయనగరం అర్బన్‌: ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్‌ ఆదేశించారు.సెలవు కోసం ఫోన్‌లో మెసేజ్‌ పెట్టే వారికి షోకాజ్‌ నోటీసు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. సెలవు కావాల్సిన వారు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇకపై ప్రతి శనివారం సాయంత్రం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజా వినతుల పరిష్కా వేదికకు వచ్చే నిరక్షరాస్యులకు అర్జీలను రాయడంలో సహకరించాడానికి కలెక్టరేట్‌ నుంచి ఇద్దరు సిబ్బందిని వచ్చే సోమవారం నుంచి కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌అంబేడ్కర్‌ తెలిపారు. నిరక్షరాస్యులైన వారు తమ అర్జీలను రాయడానికి దళారీలను ఆశ్రయిస్తున్నారని వారు అర్జీదారులను మభ్యపెట్టి వారి నుంచి డబ్బు తీసుకొని ప్రతి వారం కలెక్టరేట్‌ చుట్టు తిరిగేలా చేస్తున్నారని తెలిపారు. ఇకపై అర్జీదారులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని జిరాక్స్‌ కేంద్రాల్లో రాయించవద్దని కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో సంప్రదించాలని కలెక్టరేట్‌ సూచించారు. అర్జీలు రాయడానికి డబ్బులు ఇచ్చిన వారిపై తీసుకున్న వారిపై కూడా దృష్టి పెట్టాలని చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.

కింది స్థాయిలోనే అర్జీలను ఇవ్వాలి

అర్జీదారులు తమ సమస్యలను ముందుగా గ్రామస్థాయిలో లేదా మండల స్థాయిలో లేదా డివిజన్‌ స్థా యిలో పరిష్కారం కాని పక్షంలో మాత్రమే జిల్లా స్థాయికి రావాలని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా స్థాయిలో ఇచ్చిన అర్జీని గ్రామ స్థాయి లేదా మండల స్థాయి వా రికే పంపిస్తాం కాబట్టి సమయం వృథా కాకుండా అ ర్జీదారు గ్రామ లేదా మండలం లేదా డివిజన్‌ స్థాయిలో సంప్రదించి పరిష్కారం కానప్పుడు మాత్రమే జిల్లా స్థాయిలో సమర్పించాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 188 వినతులు అందాయి. కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌అంబేడ్కర్‌, ఇన్‌చార్జ్‌ డీఆర్‌ఓ మురళి, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, నూకరాజు, ప్రమీల గాంధీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

ఎస్పీ గ్రీవెన్స్‌ సెల్‌కు 35 ఫిర్యాదులు

విజయనగరం క్రైమ్‌: పోలీస్‌ ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)కు సోమవారం 35 ఫిర్యాదులు అందాయి. జిల్లా అడిషనల్‌ ఏఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరిగింది. మొత్తం వచ్చిన ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించి 12, కుటుంబకలహాలు 6, మోసాలకు సంబంధించి 3, ఇతర సమస్యలకు సంబంధించి 14 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్బంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సిబ్బంది సానుకూలంగా స్పందించాలని, చట్టపరిధిలో వాటిని పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేసేలా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు లీలారావు, ఆర్‌వీఆర్‌కే చౌదరి, డీసీఆర్‌బీ సీఐ సుధాకర్‌, ఎస్సై రాజేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement