
పింఛన్ పెంచండి సారూ
● కలెక్టర్‌కు వేడుకోలు
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వంలో పింఛన్ దారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సోమవారం వస్తేచాలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు కలెక్టర్ కార్యాలయానికి నడవలేని పరిస్థితుల్లో కుటుంబసభ్యుల సహాయంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కొంతమందికి అర్హత ఉన్నా పింఛన్ రావడం లేదని, మరికొంతమందికి 90శాతం దాటి వైకల్యం ఉన్నా కేవలం రూ.6వేలే పింఛన్ ఇస్తున్నారని, తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేస్తున్నారు.
స్టేట్‌లెవెల్ కరాటే చాంపియన్‌షిప్‌కు రాజాం విద్యార్థులు
రాజాం సిటీ: త్వరలో జరగనున్న స్టేట్‌లెవెల్ కరాటే చాంపియన్‌షిప్ పోటీలకు రాజాంలోని శివసైన్యం కరాటే విద్యార్థులు ఎంపికయ్యారని కోచ్ ఆర్.శివ సోమవారం తెలిపారు. ఈ నెల 18న విజయనగరంలోని రాజీవ్ ఇండోర్‌స్టేడియంలో జరిగిన పోటీల్లో కుమిటీ విభాగంలో వి.రిషిక (ప్రథమస్థానం), కాటా విభాగంలో వి.మోహిత్ (ద్వితీయ స్థానం), కె.మహేష్ (మూడో స్థానం)లో నిలిచి ఈ ఘనత సాధించారన్నారు. విద్యార్థుల ప్రతిభను పట్టణానికి చెందిన పలువురు అభినందించారు.
గిరిజనవర్సిటీలో ఆదివాసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి
● ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ
శంకరరావు
విజయనగరం అర్బన్: ఆదివాసీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కేంద్రియ గిరిజన యూనివర్సిటీలో ఆదివాసీలకు అధికప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. గిరిజన యూనివర్సిటీలో ఆదివాసీలకు కేటాయించిన సీట్ల శాతం ఇతర యూనివర్సిటీల మాదిరిగానే 75 శాతం మాత్రమే ఉందన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ప్రధానంగా ఆదివాసీ అధ్యయనాలు, ఆదివాసీ కేంద్రిత అంశాలు, పరిశోధనల కోసం ఏర్పాటు చేశారని అందువల్ల ఆదివాసీలకు మరింత ఎక్కువ సీట్లను రిజర్వ్ చేయాలని లేఖలో కోరారు.
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని శివరాం గ్రామానికి చెందిన కుమిలి భాస్కరరావు(27)అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు భాస్కరరావు గ్రామంలో డబ్బులు అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు అడగడంతో మనస్తాపం చెంది సోమవారం ఉదయం ఇంటిలో ఇనుపరాడ్డుకు బెడ్‌షీట్‌ను కట్టి ఉరివేసుకున్నాడు. ఈ మేరకు గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పింఛన్ పెంచండి సారూ

పింఛన్ పెంచండి సారూ

పింఛన్ పెంచండి సారూ

పింఛన్ పెంచండి సారూ