
ప్రభుత్వ నిర్ణయం సరికాదు
గజపతినగరం : రాష్ట్రంలో మోడల్ ప్రైమరీ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులుగా స్కూల్ అసిస్టెంట్ల నియామకం సరికాదని, ఈ పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకల చంద్రరావు అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడారు. జీవో నంబరు 117 ద్వారా అనేక మంది ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పదోన్నతులు కల్పించిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రమోషన్లు పొందిన వారిని వెనక్కి తీసుకువచ్చి మోడల్ ప్రైమరీ స్కూళ్ల హెడ్ మాస్టర్లుగా నియమించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఇప్పటికే కనీసం ప్రమోషన్లు రాక ఎస్‌జీటీలు ఎంతో వేదన చెందుతున్నారని, ఈ వేదనను ప్రభుత్వం మరింత పెద్దది చేసిందన్నారు. అసలు డీఎస్సీలో బీఎడ్ అనేది ప్రైమరీ ఉపాధ్యాయుడికి అర్హత కాదన్నప్పుడు స్కూల్ అసిస్టెంట్ ప్రైమరీ పాఠశాలలో పని చేయడానికి అర్హత ఎలా ఉంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్‌జీటీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
చంద్రరావు