
మద్యం దుకాణం వద్ద రగడ
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ మద్యం దుకాణంలో ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు మధ్యాన్ని అమ్ముతున్నారంటూ పలువురు మద్యం ప్రియులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. వల్లూరు గ్రామానికి చెందిన పంచాది శ్రీనివాసరావు, గోవింద, తాతినాయుడు, తదితరులు మద్యం కొనేందుకు షాపుకు వెళ్లగా రూ.660 ఖరీదు గల రెండు బాటిల్స్ మద్యాన్ని రూ.700కు విక్రయించారు. బాటిల్స్‌పై అదనంగా వసూలు చేస్తుండడంతో మరి కొంతమందితో కలిసి షాపు నిర్వాహకులను కొనుగోలుదారులు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే స్టిక్కర్ మారలేదని షాపులోని వ్యక్తి సమాధానం ఇచ్చాడన్నారు. ఎకై ్సజ్ సీఐకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. చీప్ లిక్కర్ బాటిల్ నుంచి పెద్ద బ్రాండ్ల వరకు ఇదే దందా కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులైనా స్పందించి బాటిల్‌పై ఉన్న ధరకే మద్యం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.