
సంతృప్తి చెందేలా వినతుల పరిష్కారం
విజయనగరం అర్బన్: ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులకు అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. ప్రధానంగా ఆడిట్ టీమ్ రిమార్కుల్లో సంతృప్తి చెందినట్లు రాయాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఅర్‌ఎస్‌లో ఇన్‌చార్జ్ కలెక్టర్ ప్రజల నుంచి వినతుల స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పెండింగ్ వినతులు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 177 వినతులు అందాయి. ఇన్‌చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్‌డీవో కీర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
వర్షాల పట్ల అప్రమత్తం
రెండు రోజుల పాటు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, మున్సిపల్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆదేశించారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ నష్టాలు సంభవిస్తే వెంటనే తెలియజేయాలని సూచించారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 32 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: స్థానిక డీపీఓలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 32 ఫిర్యాదులను ఎస్పీ వకుల్ జిందల్, ఏఎస్పీ సౌమ్యలత స్వీకరించారు. ఫిర్యాదుల్లో భూ తగాదాలు 15,, కుటుంబ కలహాలు3, మోసాలు3 ఇతర సమస్యలకు సంబంధించి 11 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులపై ఫిర్యాదు దారుల ముందే సంబంధిత స్టేషన్ హౌస్‌ఆఫీసర్లతో ఎస్పీ చర్చించారు. ఫిర్యాదుల పట్ల సానుకూలంగా సిబ్బంది స్పందించాలని సూచించారు. ఫిర్యాదులోని అంశాలను నిశితంగా పరిశీలించి అందులో వాస్తవాలను అవసరమైతే క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలని సిబ్బందిని ఆదేవించారు. ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, డీసీఆర్బీ సీఐ సుధాకర్, ఎస్సై రాజేష్ పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్
పీజీఆర్‌ఎస్‌కు 177 వినతులు

సంతృప్తి చెందేలా వినతుల పరిష్కారం