
మహిళల సంరక్షణపై డేగకన్ను
విజయనగరం క్రైమ్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహిళల కోసం, వారి సంరక్షణ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన మహిళా సంరక్షణ పోలీస్‌వింగ్‌ను కూటమి ప్రభుత్వం కాస్త మార్పులు చేసింది. వారి విధులను పర్యవేక్షించడానికి ప్రత్యేకించి ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ మేరకు ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం వీసీ హాలులో వెబ్ సైట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పాటు వాల్‌పోస్టర్‌ను తన చాంబర్‌లో ఆవిష్కరించారు. తొలిసారిగా విజయనగరం జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ను ప్రప్రథమంగా లాంచ్ చేశామని చెప్పారు. క్షేత్రస్థాయిలో మహిళా పోలీసులు నిర్వర్తించే విధులు, సీసీ కెమెరాల ఏర్పాటు, నేరాల నియంత్రణ, శక్తి యాప్ డౌన్‌లోడ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్, బాల్య వివాహాలు, అసాంఘిక కార్యక్రమాలు వంటి సమాచారాన్ని తెలియపరచడంతో పాటు చైతన్యం కలిగించే అంశాలను సదరు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నామన్నారు. ప్రధానంగా ఈ పనికి మహిళా పోలీసులను గుర్తించి సమర్థవంతంగా పని చేసేవారికి ఇచ్చిన లక్ష్యాలను బేరీజు వేసుకుని వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. నెలాఖరున నిర్వహించిన విధులు, సాధించిన లక్ష్యాల ఆధారంగా ఐదుగురిని జిల్లా కేంద్రానికి పిలిచి అభినందించి ప్రొత్సాహకాలు ఇస్తామని ఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, కమ్యూనికేషన్ ఇన్‌స్పెక్టర్లు శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్