
● రక్తదాతా సుఖీభవ!
చిత్రంలో రక్తదానం చేస్తున్న యువకుడి పేరు శనపతి రాము. రాజాం మండలంలోని పొగిరి గ్రామం. రక్తం అవసరమని వార్త తెలిస్తే చాలు.. పరుగున వెళ్లి రక్తదానం చేయడం అలవాటు. తన 18వ ఏట (2009) నుంచి రక్తదానం చేస్తున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా విజయనగరంలోని మాతృభూమి, గ్రామీణ సామాజిక వైద్యుల సేవా సంఘం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని 53వ సారి రక్తదానం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు. గ్రామానికి చెందిన యువత తనను ఆదర్శంగా తీసుకుని రక్తదానం చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. – రాజాం